Home > ఆంధ్రప్రదేశ్ > Group2, SBI Clerk Exams : ఓకే రోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ ఎగ్జామ్స్.. అయోమయంలో అభ్యర్థులు

Group2, SBI Clerk Exams : ఓకే రోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ ఎగ్జామ్స్.. అయోమయంలో అభ్యర్థులు

Group2, SBI Clerk Exams :  ఓకే రోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ ఎగ్జామ్స్.. అయోమయంలో అభ్యర్థులు
X

ఏపీలో నిరుద్యోగులకు పెద్ద చిక్కు వచ్చింది. ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ ఉండడంతో ఏం చేయాలో తెలియక డైలమాలో పడ్డారు. ఈ నెల 25న గ్రూప్ -2 నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే అదే రోజు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఈ క్రమంలో రెండు పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏ పరీక్ష రాయాలో తెలియక అయోమయంలో పడ్డారు. గ్రూప్ 2ను వాయిదా వేయాలని కోరుతున్నారు.

ఎస్బీఐ ఎగ్జామ్ నోటిఫికేషన్ నవంబర్లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత నెల రోజులకు డిసెంబర్ లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మిగాతా ఎగ్జామ్స్ లేని టైంలో ఏపీపీఎస్పీ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. కానీ ఈ సారి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ రోజే ప్రిలిమ్స్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై అభ్యర్థులు మండిపడుతున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేయాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రెండు పరీక్షలు ఒకేరోజు నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. ఏపీపీఎస్సీ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ అంశంపై ఏపీపీఎస్సీ సైతం స్పందించింది. రెండు ఎగ్జామ్స్కు దరఖాస్తు చేసుకున్న వారు తమకు హాల్ టికెట్స్ పంపించాలని తెలిపింది. ఎస్బీఐ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పింది. ఇప్పటివరకు 10మంది మాత్రమే హాల్ టికెట్లు పంపారని.. ఇంకా ఎవరైన ఉంటే ఈ నెల 19లోపు పంపాలని సూచించింది. పరీక్ష నిర్వహణపై ఏపీపీఎస్సీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

Updated : 18 Feb 2024 4:38 PM IST
Tags:    
Next Story
Share it
Top