Nara Lokesh : రుషికొండను మింగిన అనకొండ జగన్.. నారా లోకేశ్ ఫైర్
X
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రుషికొండను మింగిన అనకొండ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విశాఖ తీర ప్రాంతానికి రక్షణ గోడలా నిలిచిన రుషికొండను జగన్ అనే అవినీతి అనకొండ మింగేసిందని విమర్శలు గుప్పించారు. 9 నగరాల్లో తొమ్మిది ప్యాలెస్‌లు ఉన్న పెత్తందారుడు జగన్ అని నాారా లోకేశ్ ధ్వజమెత్తారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ మింగిన కొండల్ని, వేల కోట్ల అవినీతి సొమ్మును కక్కిస్తామన్నారు. ఆదివారం నారాలోకేశ్ విశాఖపట్టణం జిల్లాలో పర్యటించారు. ఉదయం విశాఖ తూర్పు నియోజకవర్గం, మధ్యాహ్నం దక్షిణ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సాయంత్రం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శంఖారావ సభలను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంటుపై నారా లోకేశ్ మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తే ఆ భూములు కొట్టేయాలని జగన్ ఆలోచిస్తున్నారని ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వమే కొంటుందన్నారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి కలిసి కోట్ల రూపాయలు కొల్లగొడుతూ దర్జాగా తిరుగుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందిపెడుతున్న వైసీపీ సర్కార్‌ను నామరూపం లేకుండా చేస్తామని నారా లోకేశ్ అన్నారు.