Home > ఆంధ్రప్రదేశ్ > Sharmila SON Marriage : షర్మిల ఇంట పెళ్లి సందడి.. మొదటి పత్రిక ఎవరికంటే..?

Sharmila SON Marriage : షర్మిల ఇంట పెళ్లి సందడి.. మొదటి పత్రిక ఎవరికంటే..?

Sharmila SON Marriage : షర్మిల ఇంట పెళ్లి సందడి.. మొదటి పత్రిక ఎవరికంటే..?
X

YSRT పార్టీ అధినేత్ర వైఎస్ షర్మిల పార్టీ శ్రేణులకు, తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనున్నట్లు తెలిపారు. అట్లూరి ప్రియాతో తన కుమారుడు రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు చెప్పారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు. ‘అందరికీ హ్యాపీ న్యూఇయర్. నా కుమారుడు రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియాతో జరగనున్నది. జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 17న వివాహ మహోత్సవం ఉంటుంది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. రేపు (జనవరి 2) మా కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులను తీసుకుని, ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ ను సందర్శిస్తాం. వారి పెళ్లి సందర్భంగా తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి నాన్ని ఆశీస్సులు తీసుకుంటాం’ అని షర్మిల ట్వీట్ లో చెప్పుకొచ్చారు.



Updated : 1 Jan 2024 2:13 PM IST
Tags:    
Next Story
Share it
Top