Y. S. Sharmila : బీఆర్ఎస్ను ఓడించేందుకే ఎన్నికల్లో పోటీచేయట్లేదు: వైఎస్ షర్మిల
X
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే తన లక్ష్యమని, వ్యతిరేక ఓట్లను చీల్చడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. శుక్రవారం (నవంబర్ 3) పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన షర్మిల ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్టీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓట్లను చీల్చడం వల్ల బీఆర్ఎస్ కు లాభం జరుగుతుంది. దానివల్ల మళ్లీ ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని, దానివల్ల చరిత్ర తనను క్షమించదని అన్నారు. ఇదే విషయంపై రాష్ట్ర మేదావులను కూడా సంప్రదించినట్లు తెలిపారు. ఆ కారణంగానే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చెప్పారు షర్మిల.
కర్నాటకలో గెలిచాక తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీని తాను ఎప్పుడూ వేరుగా చూడలేదని, దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం పార్టీ ఆఫీస్ లో వైఎస్ఆర్టీపీ కార్యకర్తులు షర్మిలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పార్టీని నమ్ముకుని పని చేస్తే.. తీరా ఎన్నికల సమయానికి ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. షర్మిల తమను మోసం చేసిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన షర్మిల.. కార్యకర్తలకు అభిమానులకు క్షమానణలు చెప్పారు. రాష్ట్రంలో మార్పుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్టీపీ కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.