Home > ఆంధ్రప్రదేశ్ > వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డ షర్మిల

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డ షర్మిల

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డ షర్మిల
X

జగన్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన ఆమె..వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి పై మండిపడ్డారు. రూ. 750 కోట్లు పెట్టి వైఎస్సార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే...ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం ఏడాదికి కనీసం కోటి రూపాయలు కూడా ఏపీ ప్రభుత్వం కేటాయించడం లేదని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు, 12 మండలాలకు తాగునీరు అందుతోందని చెప్పారు. 16 నెలల క్రితం ప్రాజెక్ట్ ఒక గేటు, మూడు నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయాయన్నారు. మెయింటెనెన్స్ అందించకపోవడం వల్లే గేట్లు కొట్టుకుపోతున్నాయని తెలిపారు. ఐదేండ్ల నుంచి సరిగ్గా మెయింటెనెన్స్ చేసి ఉంటే గేట్లు కొట్టుకుపోయేవి కాదని చెప్పారు.

జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్సార్ నిర్మించారన్నారు. కానీ ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ఉందని ఆరోపించారు. వైఎస్సార్ ప్రాజెక్ట్ ను పట్టించుకొని మీరు వైఎస్ వారసుడు ఎలా అవుతారని ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. సరైన సదుపాయాలు లేక గేట్లు కొట్టుకుపోయి రెండు టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఖాళీ కావడంతో...నీళ్లు లేక ఆయకట్టు రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గుర్తు చేశారు. వైఎస్సార్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నిలబెడుతున్నానని జగనన్న చెబుతున్నప్పటికీ వాటిని ఆచరించట్లేదని...ఇదేనా ఆశయాలను నిలబెట్టడం? అని షర్మిల ప్రశ్నించారు.

Updated : 27 Jan 2024 1:27 PM IST
Tags:    
Next Story
Share it
Top