Home > ఆంధ్రప్రదేశ్ > Sharmila : అన్న జగన్ ఇంటికి షర్మిల.. వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

Sharmila : అన్న జగన్ ఇంటికి షర్మిల.. వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

Sharmila : అన్న జగన్ ఇంటికి షర్మిల.. వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
X

YSRT పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం (జనవరి 3) తల్లి విజయమ్మతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. తన కుటుంబంతో కలిసి మంగళవారం (జనవరి 2) ఇడుపులపాయకు వచ్చిన షర్మిల.. ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడు జగన్ కు అందించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం విజయవాడ నుంచి షర్మిల ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నట్లు సమాచారం. షర్మిలతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా జగన్ ఇంటికి వెళ్లారు.

ఈ క్రమంలో సీఎం నివాసానికి వెళ్లకుండా.. ఆర్కేను పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటికి ఆదేశాలు రావడంతో ఆయనను సీఎం నివాసంలోనికి పంపించారు. అయితే షర్మిలతో కలిసి కాకుండా.. ఒంటరిగా (అపాయింట్మెంట్ లేకుండా) వచ్చేసరికి పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత షర్మిలతోనే వచ్చారని, ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చే క్రమంలో ట్రాఫిక్ లో ఇరుక్కుని ఆలస్యం అయినట్లు పోలీసులు తెలుసుకున్నారు.

షర్మిల కుమారుడు రాజారెడ్డికి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీన అట్లూరి ప్రియతో కుమారుడి వివాహం నిశ్చయించినట్లు షర్మిల స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి 18వ తేదీన వీరి నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే మంగళవారం కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాలోని వైఎస్సార్‌ ఘాట్‌ను షర్మిల సందర్శించారు. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు.

Updated : 3 Jan 2024 3:36 PM GMT
Tags:    
Next Story
Share it
Top