Home > ఆంధ్రప్రదేశ్ > ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్...గుడివాడ వైసీపీలో బయటపడ్డ అసమ్మతి సెగలు

ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్...గుడివాడ వైసీపీలో బయటపడ్డ అసమ్మతి సెగలు

ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్...గుడివాడ వైసీపీలో బయటపడ్డ అసమ్మతి సెగలు
X

కొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. దీంతో అధికార పార్టీ, ప్రతిపక్షాల నేతలు ఒకరి పై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పార్టీ అభ్యర్థులపై కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను మార్చిన జగన్...సర్వేల ప్రకారం ఆ స్థానంలో కొత్త అభ్యర్థులను నిలబెడుతున్నారు. పలు మార్పులు చేర్పులతో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు అసంతృప్తి నేతలు ప్రతిపక్షాల్లో జాయిన్ అవుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. కృష్ణాజిల్లా గుడివాడ వైసీపీలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందంటు వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ ఆయన అనుచరులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ టికెటు ఆయనకే ఇవ్వనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. పట్టణంలో ఏర్పాటైన ఈ బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది.

Updated : 19 Feb 2024 7:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top