Telangana Police SI 2023 : ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. తుది రాత పరీక్షలు ఎప్పటినుంచంటే..?
X
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పీఎంటీ/పీఈటీ పరీక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలకు తేదీ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పోలీస్ నియామక కమిషన్ ప్రకారం అక్టోబర్ 14,15 తేదీల్లో తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పీఎంటీ/పీఈటీ పరీక్షల రిజల్ట్ వచ్చిన తర్వాత తుది రాత పరీక్ష హాల్ టికెట్స్ అందుబాటులో ఉంచుతున్నారు. ఎస్సై తుది రాత పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయని నియామక మండలి ఛైర్మన్ అతుల్ సింగ్ తెలిపారు.
ఈ నాలుగు పేపర్లలో రెండు డిస్ర్కిప్టివ్ విధానంలో, మరో రెండు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే పరీక్ష.. అక్టోబర్ 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్ష.. అక్టోబర్ 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పేపర్ 3, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 4 పరీక్షలు ఉంటాయి.