ఆ అస్థిపంజరం ఎవరిది?
X
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో లభించిన ఆస్తిపంజరం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో దొరికిన కత్తి, క్లూస్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. అయితే ఇది హత్య..? లేకా ప్రమాదమా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడుని గుర్తించేందుకు స్పెషల్ టీమ్‌లు పనిచేస్తున్నాయి.
ఉక్కు నగరం విశాఖలో అస్థిపంజరం కలకలం సృష్టించింది. శనివారం గాజువాకలో లభించిన ఆస్థిపంజరం స్థానికంగా అందరినీ భయాందోళనకు గురిచేసింది.
ఈ స్కెలిటన్ ఎవరిది అన్న కోణంలో మిస్టరీ కేసును చేధించేందుకు పోలీసులు కష్టపడుతున్నారు. సంఘటన స్థలంలో ఓ కత్తి కూడా ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో అనుమానం మొదలైంది. ఆ పక్కనే ఓ ప్యాంటు, ఏటీఎం కార్డు, పర్సు లభించాయి. వాటి ఆధారంగా దర్యాప్తు చేసి పర్సు ఓనర్‌ను పోలీసులు గుర్తించారు. అయితే విచారణలో ఆ పర్సు సబ్బవరానికి చెందిన వ్యక్తిదని తెలిసింది. ఆ పర్సు దొంతనానికి గురైందని తెలియడంతో అక్కడే ఉన్న చెట్టుపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి గురించి ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి చిన్నచిన్న నేరాలు చేస్తూ బతికే వాడని పోలీసులు తెలుసుకున్నారు. మరిన్ని వివరాల కోసం ఘటనా స్థలంలో కలెక్ట్ చేసుకున్న వ్యక్తి అస్థిపంజరం నమూనాలను ల్యాబ్‌కు పంపించారు.