Home > ఆంధ్రప్రదేశ్ > ఆస్తి కోసం అమానుషం.. బతికుండగానే తల్లిని చంపేశాడు !!

ఆస్తి కోసం అమానుషం.. బతికుండగానే తల్లిని చంపేశాడు !!

ఆస్తి కోసం అమానుషం.. బతికుండగానే తల్లిని చంపేశాడు !!
X

తల్లి చనిపోతే కానీ ఆస్తి తనపరం కాదని భావించిన ఓ కొడుకు సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. శారీరకంగా, మానసికంగా ఆమెను హింసించడమే కాకుండా.. బతికుండగానే ఆమెను చనిపోయిందని చెప్పి ఊరందరికి ప్రచారం చేశాడు. ఆమె డెత్ సర్టిఫికేట్ కోసమే ఇదంతా చేశాడు. ఈ అమానుష ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సర్వత్రా చర్చకు దారి తీసింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి కాలనీకి చెందిన వేముల కౌసల్యకు కొడుకు రాజు, కూతురు ఉన్నారు. తన భర్త మృతి అనంతరం తన పేర ఉన్న ఆస్తిని.. కొడుకు, కూతురు తమ పేర చేయాలని ఒత్తిడి చేస్తూ దాడికి దిగారు.

రాజు.. తన భార్యా పిల్లలను కూడా చిత్రహింసలకు గురి చేయడంతో వికారాబాద్ జిల్లాలోని ధరూర్ గ్రామంలోని తల్లి వద్దకు వెళ్ళింది. ఒంటరిగా ఉన్న తల్లిని కూడా.. ఆస్తి కావాలన్న అక్కసుతో ఆమె మెడపై కాలు పెట్టి తొక్కి చంపాలనుకున్నాడు. కుమారుడి బాధను తట్టుకోలేక తల్లి కౌసల్య కూడా వికారాబాద్ జిల్లాలోని కోడలు వద్దే ఉంటుంది. ఏడాది కాలంగా ఇటు వైపు రాకపోవడంతో ఆస్తి ఎలాగైనా చేజిక్కించుకోవాలని పథకం వేసుకున్నాడు. తనకు దూరంగా బ్రతుకుతున్న తల్లి మరణించినట్లు బతికుండగానే ఫోటోకు దండేసి ప్రధాన కూడళ్ల వద్ద అశ్రునివాళి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు.

చివరికి విషయం కాస్త కోడలుకు, వృద్ధురాలికి తెలియడంతో అక్కడి నుండి నేను ఇంకా బ్రతికే ఉన్నా ఆస్తికోసం నా కొడుకు ఇలాంటి పన్నాగం పన్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయమై రాజును వివరణ కోరేందుకు ప్రయత్నించగా విలేకరులపై సైతం సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించడం గమనార్హం.




Updated : 4 Sept 2023 1:30 PM IST
Tags:    
Next Story
Share it
Top