కన్నతల్లి గుండెలపై తన్నుతూ కొడుకు దారుణం
ఆస్తికోసం తల్లిదండ్రులను చితకబాదిన కొడుకు
X
ఎన్నో కష్టాలు పడుతూ తమను పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నలపై కొందరు ప్రబుద్ధులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం మర్చిపోయి..తల్లిదండ్రులపై దారుణాలకు తెగబడుతున్నారు. ధనం, పొలం కోసం కన్నవారిని తోడబుట్టిన వారిని, కనిపెంచిన అమ్మనాన్నలపై దాడులకు పాల్పడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు..తమ పేగులనే కత్తులతో పొడిచేస్తుంటే.. నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నీరుగుట్టివారిపల్లెలో ఓ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల పశువుల ప్రవర్తించాడు. తల్లిదండ్రులపై పట్ల మానవత్వం లేకుండా ఆ కొడుకు మృగంలా వ్యవహరించాడు. ఎత్తుకుని పెంచిన తల్లి గుండెలపైనే ఆ కసాయి కొడుకు కాలితో తన్నిన్నాడు. తనను కొట్టవద్దనని ఆ తల్లి వేడుకుంటూ దండం పెడుతున్నా ఆ కసాయి కొడుకు కనికరించలేదు. అంతేకాక మరింత రెచ్చిపోయి.. ఆ మాతృమూర్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు.
నీరుగుట్టివారిపల్లెకి చెందిన వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులు కాగా…రెండు ఎకరాల పొలం మరో కుమారుడికి రాస్తావా అంటూ తల్లిదండ్రులపై దాష్టీకం చూపించాడు కుమారుడు శ్రీనివాసులు రెడ్డి. బూతులు తిడుతూ సోదరుడికి భూమి ఎలా రాశారంటూ తల్లిని ఈడ్చుకుంటా కెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిపై వీడు మనిషేనా అంటూ నెటినజ్లు కామెంట్స్ చేస్తున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.