Home > ఆంధ్రప్రదేశ్ > ప్రయాణికులకు గుడ్‎న్యూస్..ఆ రైళ్లకు అదనపు స్టాపులు కేటాయింపు...

ప్రయాణికులకు గుడ్‎న్యూస్..ఆ రైళ్లకు అదనపు స్టాపులు కేటాయింపు...

ప్రయాణికులకు గుడ్‎న్యూస్..ఆ రైళ్లకు అదనపు స్టాపులు కేటాయింపు...
X

దక్షిణ మద్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. 8 రైళ్లకు అదనపు స్టాపులను కేటాయించింది. అదే విధంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది.

8 రైళ్లకు అదనపు స్టాపులు

* ఎస్‌ఎస్‌ఎస్‌ హుబ్బళ్లి- హైదరాబాద్‌-ఎస్‌ఎస్‌ఎస్‌ హుబ్బళ్లి మధ్య సర్వీసులందించే రైళ్లు (17319, 17320) ఇంతకుముందు హోత్గి స్టేషన్ లో ఆగేవి కావు కానీ ఆగస్టు 23 నుంచి హోత్గి స్టేషన్‌లో ఆగనున్నాయి.

* విశాఖ నుంచి ముంబయి ఎల్‌టీటీ- విశాఖ(18519, 18520) మధ్య; కాకినాడ-ముంబయి-కాకినాడ(17221, 17222) మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కల్యాణ్‌ స్టేషన్‌ను అదనపు స్టాప్ గా కేటాయించారు. ఇకపై ఇక్క ఈ రూట్లలో నడిచే రైళ్లు ఆగనున్నాయి.

* ఆగస్టు 24 నుంచి విశాఖ - శిర్డీ- విశాఖ మధ్య వారానికి ఒకరోజు సర్వీసులందించే రైళ్లను (18503, 18504) కోపర్‌గాన్‌లో స్టేషన్‌లోనూ కాసేపు ఆపుతారు.

ఆరు నెలల పాటు ఎనిమిది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇకపై అదనంగా కేటాయించిన స్టేషన్లలోనూ ఆగుతాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అలాగే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది.

కాకినాడకు ప్రత్యేక రైళ్లు..

కాకినాడకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించింది. కాకినాడ టౌన్‌ -లింగంపల్లి-కాకినాడ టౌన్‌ మధ్య స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి 14 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సోమ, బుధ, శుక్రవారాల్లో కాకినాడ నుంచి రాత్రి 20.10గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15గంటలకు లింగంపల్లి చేరుకోనుంది. అలాగే, మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.25గంటలకు లింగంపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10గంలకు కాకినాడకు చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్‌, విజయవాడ జంక్షన్‌, గుంటూరు జంక్షన్‌, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

Updated : 22 Aug 2023 4:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top