Home > ఆంధ్రప్రదేశ్ > ప్రయాణికులకు అలర్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు

ప్రయాణికులకు అలర్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు

ప్రయాణికులకు అలర్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు
X

ఏపీలో పలు రైళ్లు రద్దు అయ్యాయి. మరికొన్నింటి దారి మళ్లించారు. ఈ క్రమంలో ప్రయాణికులకు అధికారులు పలు సూచనలు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్‌లోని అనకాపల్లి - తాడి సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాఫిక్‌ బ్లాక్‌ పనుల కారణంగా ఈ నెల ఇవాళ్టి నుంచి సెప్టెంబర్‌ 3 వరకు పలు రైళ్లను పూర్తిగా, మరి కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు దీనిని గమనించి తమకు సహకరించాలని కోరారు.

మరమ్మతుల నేపథ్యంలో మచిలీపట్నం - విశాఖపట్నం (17219) రైలును రద్దు చేశారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు విశాఖపట్నం - మచిలీపట్నం (17220) రైలును రద్దు చేశారు. సెప్టెంబర్‌ 2, 4 తేదీల్లో విజయవాడ - విశాఖ(22702/22701) రైళ్లు, సెప్టెంబర్ 4న రాజమండ్రి - విశాఖ (07466/07467), గుంటూరు - విశాఖ(17239), కాకినాడ పోర్టు - విశాఖపట్నం (17267/17268) రైళ్లను రద్దు చేశారు. సెప్టెంబర్‌ 5న విశాఖపట్నం - గుంటూరు (17240) రైలును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

పాక్షిక రద్దు..

అదేవిధంగా సెప్టెంబర్‌ 1, 3 తేదీల్లో తిరుపతి - విశాఖపట్నం (22708) రైలు సామర్లకోట నుంచి విశాఖ మధ్య నడుస్తుందని అధికారులు చెప్పారు. సెప్టెంబర్‌ 3,5 తేదీల్లో విశాఖ - తిరుపతి (22707) రైలు సామర్లకోట వరకే నడుస్తుంది. ఈ నెల 31నుంచి సెప్టెంబర్ 4రకు విజయవాడ - విశాఖపట్నం రైలు విశాఖ- అనకాపల్లి మధ్య నడుస్తుందన్నారు. ఈ మార్పులకు తగ్గట్లుగా ప్రయాణికులు తమ జర్నీని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Updated : 30 Aug 2023 9:33 AM IST
Tags:    
Next Story
Share it
Top