ప్రయాణికులకు అలర్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు
X
ఏపీలో పలు రైళ్లు రద్దు అయ్యాయి. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల జరుగుతుండడంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు గుంటూరు - విశాఖపట్నం, విశాఖ - మచిలీపట్నం రైళ్లను రద్దు చేశారు. సెప్టెంబర్ 6 నుంచి 11 వరకు విశాఖ - గుంటూరు, 5,6,8,9 తేదీల్లో విశాఖపట్నం - విజయవాడ, విజయవాడ - విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దుచేశారు.
సెప్టెంబర్ 9వరకు గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం - విశాఖ, విశాఖ - లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. ఈ నెల 10వరకు లింగంపల్లి - విశాఖ, రాయగడ-గుంటూరు, విజయవాడ - విశాఖ, విశాఖ - విజయవాడ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక 6,8 తేదీల్లో తిరుపతి - విశాఖ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ సామర్లకోట వరకే నడుస్తుంది. 7, 9 తేదీల్లో విశాఖ నుంచి బయల్దేరాల్సిన విశాఖ - తిరుపతి రైలు సామర్లకోట స్టేషన్ నుంచి బయలుదేరుతుందని చెప్పారు. దీనికి తగ్గట్లుగా ప్రయాణికులు తమ జర్నీని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.