శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. కొత్తగా సిస్టమ్ తెచ్చిన టీటీడీ
X
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్‌లైన్‌లోనే కోనుగోలు చేసేలా టీటీడీ చర్యలు తీసుకుంది.ఎంబీసీ-34లోని కౌంటర్ వద్ద టికెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూలైన్‌లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటున్న క్రమంలో టీటీడీ నూతన విధానం అమలు చేస్తోంది. సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్‌కు ఓ లింక్‌తో కూడిన మెసేజ్‌ను పంపుతున్నారు. విచక్షణ కోటాలో జారీ చేసే దర్శనం టికెట్ల పొందిన భక్తులు సౌకర్యార్థం కొత్తగా ఎస్ఎంఎస్ పే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది.ఈ విధానం ఈనెల ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చింది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్‌ను భక్తుల మొబైల్ నంబర్‌కు పంపిస్తారు. భక్తులు ఆ లింక్‌పైన క్లిక్ చేసి యూపీఐ, క్రెడిట్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శన టికెట్లను ప్రిట్ తీసుకోవచ్చు.
ఇప్పటికే ఆఫ్‌లైన్‌లో సీఆర్‌వో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందుతున్న భక్తులకు విధానాన్ని అమలు చేస్తున్నారు. తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సుకు 57 మంది స్వామీజీలను ఆహ్వానించగా అందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుగ్రహభాషణం అందించారని, ఈ విధంగా సదస్సు విజయవంతమైందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. నభూతో నభవిష్యతి అన్నట్టుగా ధార్మిక సదస్సు జరిగిందన్నారు. ధార్మిక సదస్సుకు స్వామి వారి ఆశీస్సులు చక్కగా ఉన్నాయనడంలో సందేహాలు లేదన్నారు. సదస్సులో శనివారం 24 మంది మహనీయులు, ఆదివారం 17 మంది మహనీయలు ప్రత్యక్షంగా, 16 మంది వర్చువల్ గా తమ సూచనలు, సలహాలు ఇచ్చారని వివరించారు. మఠాధిపతులు, పీఠాధిపతులు తమ కీలక సలహాలు, సూచనలిచ్చి టీటీడీకి దిశా నిర్దేశం చేశారని చెప్పారు. మహనీయుల ఉపన్యాసాలను రికార్డ్ చేశామని, వీటిని తీర్మానాలుగా చేసి రేపటి రోజున మఠాధిపతులు, పీఠాధిపతులు సమక్షంలో మీడియా ప్రతినిధుల ముందు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రవేశపెడతారని తెలిపారు. వచ్చే బోర్డు సమావేశంలో వీటిని ఆమోదించి టీటీడీ తదుపరి కార్యాచరణ చేపడుతుందని చెప్పారు.