Tirumala : తిరుమలలో శ్రీవారి పాదాలు, పాపవినాశనం మూసివేత
X
తిరుమలలో పొగమంచు, వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ మూసివేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేసింది. పొగమంచుతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులతోపాటు ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొన్నారు. ఇక అలిపిరి మార్గంలో ప్రయాణించే వారిని టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఘాట్‌రోడ్లలో మరమ్మతు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వెళ్లాలని సూచిస్తున్నారు.
మరోవైపు దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే విమాన ప్రయాణికుల కోసం తిరుపతి ఎయిర్ పోర్టులో ప్రతి రోజు 100 ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా.. ఇవాళ్టి నుంచి తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో ఆ టికెట్లను జారీ చేయనున్నారు. బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్‌లైన్ టికెట్లను ఇస్తామని టీటీడీ తెలిపింది. భక్తులు దీనిని గమనించాలని టీటీడీ సూచించింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.