Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ పోలీసుల గంజాయి సరఫరా..హైదరాబాద్‌‌లో అరెస్ట్

ఏపీ పోలీసుల గంజాయి సరఫరా..హైదరాబాద్‌‌లో అరెస్ట్

ఏపీ పోలీసుల గంజాయి సరఫరా..హైదరాబాద్‌‌లో అరెస్ట్
X

గంజాయి స్మగ్లింగ్ చేస్తు ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. హైదరాబాద్‌ (Hyderabad) బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. నిందితులను ఏపీఎస్పీకి (APSP) చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా పోలీసులుగా గుర్తించారు. డబ్బు సంపాదించాలనే ఆశతో ఉద్యోగానికి సెలవు పెట్టి మరి గంజాయి రవాణ చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరి కారులో 22 కిలోల గంజాయిని (Marijuana) పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు (Chandrababu) స్పందించారు. దురదృష్టవశాత్తు గత నాలుగున్నారేళ్లుగా ఏపీ అభివృద్ధి కంటే డ్రగ్స్ విషయంలోనే హెడ్ లైన్స్‌లో నిలిచిందని ఆయన అన్నారు.

ఇద్దరు పోలీసులు గంజాయితో దొరకడం ఆందోళనకరం ఈ మైండ్ ఎవరు ఇందులో భాగమైన నాయకులెవరు అనే విషయం వైసీపీ ప్రభుత్వం (YCP Govt) వెల్లడించాలని ఆయన ట్వీట్ చేశారు. పోలీసుల విచారణలో తేలింది. ఆరోగ్యం బాగాలేదని సెలవుపెట్టి మరీ నర్సీపట్నం నుంచి బాచుపల్లికి గంజాయి తరలించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే మొదటిసారా లేక ఇంతకుముందు కూడా ఇలా అక్రమంగా రవాణా చేశారా అనే విషయాలను రాబట్టే పనిలో పడ్డారు. మరోవైపు గంజాయిని తరలిస్తూ హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు( AP Police) పట్టుబడటంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ విషయంపై విపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి.



Updated : 2 Feb 2024 3:50 PM IST
Tags:    
Next Story
Share it
Top