Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు కేసులో లూథ్రా బిజీ.. అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు విచారణ వాయిదా

చంద్రబాబు కేసులో లూథ్రా బిజీ.. అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు విచారణ వాయిదా

చంద్రబాబు కేసులో లూథ్రా బిజీ.. అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు విచారణ వాయిదా
X

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి‌కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని వివేకా కుమార్తె సునితా రెడ్డి సుప్రీం‎లో సవాలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగ్గా.. విచారణను వాయిదా వేయాలని సునీత తరుపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.

అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సునీత విజ్ఞప్తిని మన్నించిన న్యాయస్థానం విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. మే 31న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని.. కేసు దర్యాప్తుకి సహకరించకుండా తప్పించుకుంటున్నారని సునీత సుప్రీంను ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.





Updated : 11 Sept 2023 2:08 PM IST
Tags:    
Next Story
Share it
Top