Home > ఆంధ్రప్రదేశ్ > జగన్‌ అక్రమాస్తుల కేసు.. విజయసాయి రెడ్డికి సుప్రీం నోటీసులు

జగన్‌ అక్రమాస్తుల కేసు.. విజయసాయి రెడ్డికి సుప్రీం నోటీసులు

జగన్‌ అక్రమాస్తుల కేసు.. విజయసాయి రెడ్డికి సుప్రీం నోటీసులు
X

జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీబీఐ కేసుల విచారణ తేలే వరకు ఈడీ విచారణ ఆపాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులపై సెప్టెంబరు 5లోగా సమాధానం చెప్పాలని ప్రతివాదులను సుప్రీం ఆదేశించింది. ఈ కేసు పూర్తి స్థాయి విచారణ ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలో, త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలో ఆ రోజే నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీ కేసుల విచారణ సమాంతరంగా కొనసాగించొచ్చని గతంలో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అయితే తెలంగాణ హైకోర్టు దాన్ని తొసిపుచ్చుతూ సీబీఐ ఛార్జిషీట్లపై తీర్పు వెల్లడైన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంను ఆశ్రయించింది. ఈడీ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మరో వైపు జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా జప్తు చేసిన భారతి సిమెంట్స్ ఆస్తుల విడుదలకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ కేసు విచారణ ఈనెల 14న జరగనుంది.

Updated : 5 July 2023 1:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top