Chandrababu Quash Petition : సుప్రీంలో చంద్రబాబు పిటిషన్పై విచారణ వాయిదా
X
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంలో కోర్టులో విచారణ వాయిదా పడింది (Chandrababu Quash Petition Postponed ). అక్డోబర్ 3న కేసు విచారణ చేపడతామని సీజేఐ తెలిపారు. తగిన ధర్మాసనానికి పిటిషన్ను బదిలీ చేస్తామన్నారు. అంతకుముందు ఈ కేసు విచారణ నుంచి తెలుగు న్యాయమూర్తి జస్టిస్ భట్టి తప్పుకున్నారు. దీంతో విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలో చంద్రబాబు అడ్వకేట్ లూథ్రా పిటిషన్ను సీజేఐ ముందు పిటిషన్ను మెన్షన్ చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని కోరారు. అయితే సీజేఐ చంద్రచూడ్ విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు సుప్రీంలో క్వాష్ పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనను అరెస్ట్ చేశారని అందులో పేర్కొన్నారు. అంతకుముందు చంద్రబాబు క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును ఆయన శనివారం సుప్రీంలో సవాల్ చేశారు.