Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ
X
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టైన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది (Chandrababu Quash Petition). యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేశారని అందుకే దాన్ని కొట్టివేయాలని ఆయన ఎస్ఎల్పీ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిల నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. ఐటెం నెం. 61 కింద ఈ కేసు లిస్ట్ అయి ఉంది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి గత శుక్రవారం కొట్టివేశారు. దీంతో శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థించడంతో పాటు తనపై నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని చెప్పారు.