Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ
X

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కామ్ అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆదివారం జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా అక్టోబర్ 5 వరకు దాన్ని పొడగించారు. ఇదిలా ఉంటే తన అరెస్టుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఇవాళ విచారణకు రానుంది.

ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. అయితే ఈ తీర్పును రివ్యూ చేయాలని కోరుతూ చంద్రబాబు తరఫు లాయర్లు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపే అవకాశముంది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో బెయిల్ పిటిషన్ చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఇవాళ వాదనలు విననుంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ స్కాంకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపైనా ఏసీబీ కోర్టు ఈరోజు విచారణ జరపనుంది. ఈ క్రమంలో ఈ రెండు కేసుల్లో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై సైతం న్యాయమూర్తి విచారణ జరపనున్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగల్లులో పోలీసులపై దాడి కేసులో మందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఆదేశాలు వెలువడే అవకాశముంది.

ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబు సీఐడీ కస్టడీ ఆదివారంతో ముగిసింది. దీంతో సీఐడీ అధికారులు మరోసారి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ కోసం చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపైనా న్యాయమూర్తి ఇవాళ వాదనలు విననున్నారు.

Updated : 25 Sep 2023 3:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top