వైఎస్ వివేకా హత్య కేసు..పీఏ కృష్ణారెడ్డి పిటిషన్ కొట్టివేత
X
వైఎస్ వివేకా హత్య కేసులో అతని పీఏ కృష్ణారెడ్డి అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేసులో తనను కూడా బాధితుడిగా పరిగణించాలంటూ పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో జోక్యానికి సిద్ధంగాలేమని వెల్లడించింది. హైకోర్టు ఎదుట తమ వాదనలను వినిపించుకోవాలని సూచించింది. తమ అభిప్రాయం లేకుండా హైకోర్టు తన నిర్ణయాన్ని తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం లిఖిత పూర్వకంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేయనుంది.
వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనను బాధితుడిగా గుర్తించాలంటూ కృష్ణారెడ్డి ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్యపై మొదట ఫిర్యాదు చేసింది తానేనని తనను బాధితుడిగా గుర్తించాలని న్యాయస్థానాన్ని కోరాడు. ఈ కేసులో దస్తగిరిఅప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేసే అధికారం తనకు ఉన్నట్లు ఆదేశాల ఇవ్వాలని కోరాడు. కృష్ణారెడ్డి పిటిషన్‌ను బుధవారం విచారణించిన న్యాయస్థానం కొట్టివేసింది.