మా జోలికి వస్తే నీ పాడె కడతాను..జేసీకి కేతిరెడ్డి వార్నింగ్...
X
ఏపీలోని తాడిపత్రి రాజకీయం హీట్ పుట్టిస్తోంది. జేసీ vs కేతిరెడ్డి మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మితిమీరుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా జేసి విమర్శలపై మరోసారి స్పందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జోలికి వస్తే ఏం చేయాలో అదే చేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
నా పాడె కాదు.. నీ పాడె కడతాను
చీనీ తోటల బీమాపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలపై కేతిరెడ్డి మండిపడ్డారు. అందరితో పాటు తనకూ రైతు బీమా వచ్చిందని, ఇందులో ఏమైనా అవినీతి జరిగితే నిరూపించాలని సవాల్ చేశారు. అంతేకానీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను నిజాయితీగా వ్యవసాయం, వ్యాపారం చేసి సంపాదించా నని చెప్పారు. తన ఉనికి కోల్పోతుంది అంటే…నేను ఎంత దూరం అయినా వెళతానంటూ సమాధానమిచ్చారు. 2024లో ఎన్నికలు అయ్యాక నేను పాడె ఎక్కుతానో… నువ్వు పాడె ఎక్కుతావో చూస్తానంటూ జేసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమని చంపాలనే ఆలోచన వచ్చినా మీ అంతు చూస్తామంటూ జేసికి కేతిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
జగన్ కాలు పట్టుకో...
జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ సైకో అని కేతిరెడ్డి దుయ్యబట్టారు. 2024లో జేసీ కుటుంబానికి రాజకీయంగా సమాధి కడతామని చెప్పారు. టీడీపీ టిక్కెట్ కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకోవడం కాదు..జగన్ కాళ్ళు పట్టుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకుకి వైసీపీ టిక్కెట్ ఇప్పించి గెలిపిస్తామన్నారు. మా అన్న హత్య కేసులో మేము రాజీ పడలేదని.. అప్పుడు వాళ్లు అధికారంలో ఉన్నారు సాక్షాలను అధారాలు లేకుండా చేశారు కేసు నిలబదని మేము వదిలేశామని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు.