అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. వైసీపీ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రేపటి నుంచి శాసనసభ, శాసనమండలికి హాజరుకామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. ఇవాళ ఉదయం అసెంబ్లీ ప్రారంభమవ్వగానే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో సభలో వీడియో తీసినందుకు అచ్చెన్నాయుడు, అశోక్లను సెషన్ ముగిసేవరకు స్పీకర్ సస్పెన్షన్ వేశారు. ఇదే సమయంలో
బాలకృష్ణ విజిల్ వేస్తూ హల్ చల్ చేశారు. చంద్రబాబు సీటు ఎక్కి ఆయన విజిల్ ఊదారు. చంద్రబాబుపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇక టీడీపీ నేతల తీరుపై మంత్రులు ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదని.. అసెంబ్లీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.