Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu: అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట.. చంద్రబాబుకు ఆహ్వానం

Chandrababu: అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట.. చంద్రబాబుకు ఆహ్వానం

Chandrababu: అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట.. చంద్రబాబుకు ఆహ్వానం
X

ఈ నెల 22వ తేదీన అత్యంత వైభవోపేతంగా అయోధ్యలోని రామ మందిరంలో శ్రీ రామ్ లల్ల విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. విగ్రహ ప్రతిష్టాపనకు నిన్నటి నుండి సాంప్రదాయబద్ధమైన ముందస్తు క్రతువులు ప్రారంభమయ్యాయి. కాగా ఈ చారిత్రాత్మక ఘట్టానికి 150 దేశాల నుంచి నాలుగు వేల మంది ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందింది. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానం పంపినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఇప్పటికే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభించింది శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి సహాయం వివిధ రూపాల్లో అందుతూనే ఉంది.. ఈ నెల 21వ తేదీ వరకు ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు జరగబోతున్నాయి.. 18వ తేదీన ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ఉంచనున్నారు. 22వ తేదీ మధ్నాహ్నం 12:20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆరంభం కానుంది.. ఇప్పటికే ఈ కార్యక్రమానికి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలను పంపిస్తున్నారు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు, విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు. ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం మరియు శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ఏపీ నేతలకు ఆహ్వానం అందింది. సినీ నటుడు చిరంజీవికి, మోహన్ బాబు తదితరులకు కూడా ఆహ్వానాలు అందాయి.




Updated : 17 Jan 2024 1:37 PM IST
Tags:    
Next Story
Share it
Top