Home > ఆంధ్రప్రదేశ్ > జగనన్న వదిలిన బాణం.. ఆయన మీదకే వెళ్తోంది : చంద్రబాబు

జగనన్న వదిలిన బాణం.. ఆయన మీదకే వెళ్తోంది : చంద్రబాబు

జగనన్న వదిలిన బాణం.. ఆయన మీదకే వెళ్తోంది : చంద్రబాబు
X

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. షర్మిల ఆ పార్టీలో చేరడం వెనక చంద్రబాబు హస్తం ఉందంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ ఆరోపణలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలను అప్పట్లో జగనన్న బాణ అన్నారన్నారు. జగనన్న వదిలిన బాణం ఈ రోజు ఏమైంది.. ఆయన మీదకే వెళ్తోందని కౌంటర్ ఇచ్చారు. ‘‘వాళ్లింట్లో రాజకీయాలతో మాకేంటి సంబంధం..?. షర్మిలను నేనే ఆడిస్తే.. అప్పుడు పాదయాత్ర చేయించింది కూడా నేనేనా..?. ఇప్పుడు తిరుగుబాటు చేయించింది కూడా నేనేనా’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

వైఎస్ మరణం అంశంపైనా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ వైఎస్ చనిపోయినప్పుడు.. అందుకు రిలయన్సే కారణమని అప్పట్లో అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ముఖేష్ అంబానీ రాష్ట్రానికి వస్తే సాదరంగా వాళ్లే ఆహ్వానించారు. వాళ్ల మనిషి పరిమళ్ నత్వానీకి వైసీపీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇదీ జగన్ విశ్వసనీయత. ఇటువంటి వ్యక్తిని ఏమనాలో తెలియడం లేదు’’ అని బాబు విమర్శలు గుప్పించారు.దేశంలోనే ధనిక సీఎంగా జగన్ నిలిచారని.. ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.


Updated : 7 Jan 2024 9:35 PM IST
Tags:    
Next Story
Share it
Top