Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబుకు వాట్సప్ చాటింగ్ చూపిన సిట్ అధికారులు..ఆ తర్వాత..

చంద్రబాబుకు వాట్సప్ చాటింగ్ చూపిన సిట్ అధికారులు..ఆ తర్వాత..

చంద్రబాబుకు వాట్సప్ చాటింగ్ చూపిన సిట్ అధికారులు..ఆ తర్వాత..
X

ఏపీలో చంద్రబాబు అరెస్ట్ ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతం ఆయన్ను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బాబు ముందు అధికారులు 20ప్రశ్నలు ఉంచారు. ఈ స్కాంతో తనకు ఎటువంటి సంబంధం లేదని అధికారులతో బాబు చెప్పారు. దీంతో పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధుల మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ను బాబకు అధికారులు చూపించారు. అంతేకాకుండా 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసిన ముఖ్యమైన నోట్‌ఫైల్స్‌ను సిఐడి అధికారులు చూపించినట్టు తెలిసింది.

తాను కోర్టులోనే తేల్చుకుంటానని సిట్తో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక విచారణకు చంద్రబాబు సహకరించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబును కాసేపట్లో ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బాబు తరుపున వాదించేందుకు ప్రముఖ అడ్వకేట్ను టీడీపీ రంగంలోకి దించింది. సుప్రీం సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా బాబు తరుపున వాదించనున్నారు.ఇదిలా ఉండగా బాబుకు బెయిల్ లభిస్తుందా.. రిమాండ్‌కు వెళ్తారా లేక సీఐడీ కస్టడీకి తీసుకుంటుందా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


Updated : 9 Sept 2023 8:38 PM IST
Tags:    
Next Story
Share it
Top