Home > ఆంధ్రప్రదేశ్ > హైదరాబాద్ కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

హైదరాబాద్ కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

హైదరాబాద్ కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు
X

టీడీపీ చీఫ్ చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. రాజమహేంద్రవరం జైలు నుంచి మంగళవారం విడుదలైన ఆయన బుధవారం ఉదయం ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం వద్దకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు.

కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు మీడియాతో మాట్లాడలేదు. కారులో నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబు నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.


Updated : 1 Nov 2023 6:01 PM IST
Tags:    
Next Story
Share it
Top