జగన్ లాంటి వాడిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు..చంద్రబాబు
X
జగన్ లాంటి వాడిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ మూర్ఖత్వానికి మొత్తం జాతి బలి కావాలా అని ప్రశ్నించారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక్క భవనాన్ని కూడా నిర్మించలేని జగన్ , భూముల సెటిల్మెంట్లు చేసి మాత్రం వేల కోట్ల రూపాయలు ఆర్జించాడని ఆరోపించారు. వైజాగ్‌లోని రుషికొండను బోడి గుండుగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. జగన్ పాలనలో ఏపీ రైతులు ఆత్మహత్యాల్లో రెండో స్థానంలో ఉన్నారన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని వారి జీవితాలు నాశనం అయ్యాయని బాబు విమర్శించారు.
మీడియా చిట్‌చాట్‌లో బాబు మాట్లాడుతూ.." జగన్ మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే.. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి అనే పథకాల ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులను తీసుకువస్తాం. అదే విధంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. అంతే కాదు ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తాం. రాష్ట్ర మహిళలకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతా ఇస్తాం. అప్పట్లో నేను టెక్నాలజీ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. కానీ నేడు అదే టెక్నాలజీని అందరూ ఉపయోగిస్తున్నారు. అందుకే టీడీపీ అధికారంలోకి రాగానే యువత శక్తిని ఉపయోగించి వారిని ముందుకు నడిపిస్తాం.
ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ఒక భవనం కూడా కట్టలేదు. దేశంలో ఎక్కడా లేనన్ని వనరులు రాష్ట్రంలోనే ఉన్నాయి. పట్టిసీమ కడితే ఆనాడు ఎగతాళి చేశారు, మరి ఈరోజు పట్టిసీమ లేకపోతే సర్కార్ ఏం చేసేది. పోలవరాన్ని జగన్ పూర్తిగా ముంచేశాడు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తి అయితే దక్షిణ భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో నిలబడేది. కానీ జగన్ మూర్ఖత్వం వల్ల ఒక జాతి మొత్తం బలి అవ్వాల్సి వస్తోంది. జగన్ లాంటి వాడిని నా లైఫ్‌లో ఎన్నడూ చూడలేదు. భూముల సెటిల్మెంట్లు చేసి వేల కోట్లు దండుకుంటున్నాడు. రుషి కొండను బొడిగుండు చేశాడు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ టాప్ 2లో ఉంది. కౌలు రైతులు పూర్తిగా దీనావస్థలో ఉన్నారు" అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.