నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ బస్సుయాత్ర ప్రారంభం..
X
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరి ఊహించినట్లే యాత్ర ప్రారంభించారు. తన భర్తకు న్యాయం జరగాలంటూ ‘నిజం గెలవాలి’ పేరుతో బుధవారం బస్సు యాత్ర మొదలుపెట్టారు. బాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో తన తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి యాత్ర మొదలు పెట్టారు.
బాబు అరెస్టుతో మానసిక వేదనకు గురైన చనిపోయిన చంద్రగిరి టీడీపీ కార్యకర్త ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘నిజం గెలవాలి’ యాత్ర మూడు రోజులు సాగుతుంది. బుధవారం చంద్రగిరిలో, గురువారం తిరుపతిలో, శుక్రవారం శ్రీకాళహస్తిలో భువనేశ్వరి పర్యటిస్తారు. మహిళలతో, టీడీపీ కార్యకర్తలతో సమావేశమై ప్రసంగిస్తారు. పార్టీ శ్రేణులు ఆందోళన పడొద్దని భరోసా ఇస్తారు బాబు అరెస్టుతో అవేదనకు గురైన చనిపోయిన పాకాల టీడీపీ కార్యకర్త చిన్నస్వామి నాయుడి కుటుంబాన్ని కూడా ఆమె పరామర్శిస్తారు. అగరాలలో జరిగే సభలో పాల్గొంటారు. స్కీల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన బాబును జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని, సాంకేతిక కారణాలతో బెయిల్ రాకుండా అడ్డుకుంటోందని టీడీపీ శ్రేణులు నెలన్నర నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బాబు 47 రోజులుగా రాజమండ్రి సెంట్రల్లో జైల్లో ఉంటున్నారు.