Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu: ఈరోజు చంద్రబాబు అన్నం తినరు... కాసేపట్లో బండారు అరెస్ట్!

Chandrababu: ఈరోజు చంద్రబాబు అన్నం తినరు... కాసేపట్లో బండారు అరెస్ట్!

Chandrababu: ఈరోజు చంద్రబాబు అన్నం తినరు... కాసేపట్లో బండారు అరెస్ట్!
X

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. రాజమండ్రి జైలులో ఉన్న ఆయన తన అరెస్ట్‌కు నిరసనగా ఒక రోజు నిరశనకు దిగారు. రాజమండ్రిలోనే ఉన్న ఆయన భార్య భువనేశ్వరి కూడా నిరాహార దీక్ష చేపట్టారు. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నిరసనలు 19వ రోజుకు చేరుకున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లో శ్రేణులు ఆందోళనకు దిగాయి. గాంధీ జయంతి కావడంతో రాజమండ్రి క్వారీ సెంటర్ వద్ద నాలుగు ఎకరాల్లో ‘సత్యమేవ జయతే’ పేరుతో భారీ ధర్నా నిర్వహిస్తున్నాయి. వేలమంది హాజరుకానున్నారు. పలువురు నాయకులు ఇందులో పాల్గొంటారు.

మరోవైపు మంత్రి రోజాపై ‘నీలిచిత్రాల’ వ్యాఖ్యల చేసిన టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అనకాపల్లిలోని వెన్నెలపాలెంలోని ఆయన ఇంటికి పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. బండారుపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌తోపాటు వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరడంతో కాసేపట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Updated : 2 Oct 2023 3:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top