పుష్పలో చంద్రబాబు .. వాళ్లు ఏడుస్తున్నారని కామెంట్
X
పుష్ప.. ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన మూవీ. ఈ సినిమా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ స్పెషల్ క్రేజ్ తీసుకరావడమే కాదు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. తెలుగులో ఏ హీరో సాధించిన ఘనతను ఈ మూవీతో బన్నీ సాధించాడు. మరికొన్ని రోజుల్లో పుష్ప 2 మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్పలో తన ఫొటోను చూసి వైసీపీ నేతలు ఏడుస్తున్నారంటూ బాబు విమర్శించారు.
పుష్పలో కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్‌లో నా ఫొటో ఉంటుంది. ఆ సినిమాలో చూపించిన కాలంలో నేను సీఎంగా ఉన్నాననో.. లేక ఎర్రచందనం స్మగ్లర్లను నేను కంట్రోల్ చేశాననో వాళ్లు నా ఫొటో పెట్టొచ్చు. వైసీపీ వాళ్లు దానికే ఏడుస్తున్నారు’’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కాగా ఆ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికినప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్‌లో గోడకు చంద్రబాబు ఫొటో ఉంటుంది. అలాగే సినిమాలోని మరో సన్నివేశంలోనూ ఆయన ఫొటో కన్పిస్తుంది.
ఇక జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. కాగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తెలుగు తోపాటు మిగితా భాషల్లోనూ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఈ సినిమా సంగీతానికి గానూ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్కు సైతం జాతీయ అవార్డు వచ్చింది. వచ్చే ఏడాది పుష్ప 2 మూవీ రిలీజ్ కానుంది. ఇది కూడా పాన్ ఇండియా లేవెల్లో వస్తుంది.