Home > ఆంధ్రప్రదేశ్ > చెప్పుతో కొట్టుకొని టీడీపీ కౌన్సిలర్‌ నిరసన

చెప్పుతో కొట్టుకొని టీడీపీ కౌన్సిలర్‌ నిరసన

చెప్పుతో కొట్టుకొని టీడీపీ కౌన్సిలర్‌ నిరసన
X

నర్సీపట్నం మున్సిపల్‌ సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీడీపీ కౌన్సిలర్‌ నిరసనకు దిగారు. తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. వైసీపీ హయాంలో ఒక్కపని కూడా జరగడం లేదని వాపోయారు. ప్రజా సేవ చేయడానికి వచ్చానే తప్ప.. ఆస్తులు పోగేసుకోవడానికి కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఆవేదన చూసి పలువురు సభ్యులు చలించిపోయారు.

కౌన్సిలర్ గా ఎన్నికై మూడేళ్లు గడిచినా పదవీకాలంలో ఏ పనీ చేయలేకపోయానంటూ టీడీపీ కౌన్సిలర్ రామరాజు ఆవేదన వ్యక్తంచేశారు. దాదాపు 30 నెలలు గడిచినప్పటికీ తన వార్డులో తాగునీటి కొళాయి కూడా వేయించుకోలేని దుస్థితిలో ఉన్నానని వాపోయారు. మున్సిపల్ సమావేశంలోనే తన ఆవేదనను వ్యక్తంచేస్తూ చెప్పుతో తనను తాను కొట్టుకొని నిరసన తెలిపారు. నర్సీపట్నం మున్సిపల్ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం సభ్యులు పలు అంశాలను లేవనెత్తి.. సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు. దీనిలో భాగంగానే తన వార్డులో తాగునీటి సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నా.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తాను ఒక్క కుళాయి కూడా వేయించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ రామరాజు చెప్పుతో కొట్టుకున్నారు.

Updated : 31 July 2023 7:10 PM IST
Tags:    
Next Story
Share it
Top