చంద్రబాబు అరెస్ట్.. జూ.ఎన్టీఆర్పై దారుణమైన విమర్శలు..
X
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్తో ఏపీలో పెద్ద దుమారం రేగుతోంది. ఆయనకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్, వైసీపీ వ్యవహరించిన తీరును టీడీపీ నాయకులతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు ఖండించారు. పవన్.. బాబును కలవాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్ అయిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఎన్టీఆర్ స్పందించకపోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తారక్ను విమర్శిస్తూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ మంత్రి ఎన్టీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం చంద్రబాబును జైలుకి పంపితే.. కుటుంబ సభ్యుడిగా ఆయన స్పందించడా.. అసలు ఆయన బతికే ఉన్నాడా’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
తారక్ అభిమానులు మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు.. అందుకే సైలెంట్ గా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం టీడీపీ, చంద్రబాబుకు తారక్ దూరంగా ఉండాలనుకుంటున్నారని అంటున్నారు. చంద్రబాబు అరెస్టులో ఎన్టీఆర్ అంశం చర్చనీయాంశంగా మారింది.