Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ బంద్.. ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్ట్

ఏపీ బంద్.. ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్ట్

ఏపీ బంద్.. ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్ట్
X

చంద్రబాబు జైలుకెళ్లడం ఏపీలో కాక రేపుతోంది. చంద్రబాబుకు రిమాండ్ విధించడాన్ని నిరసిస్తూ టీడీపీ ఇవాళ ఏపీవ్యాప్తంగా బంద్ చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో టీడీపీ నేతలు నిరసనలు చేపడుతున్నారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, అశోక్‌ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తన కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని.. అవసరమైతే తనను జైల్లో పెట్టాలని కోటంరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తీర్పు వెలువడగానే వెంటనే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.

అదేవిధంగా హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. అటు సీఐడీ సైతం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబును 10రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం బాబు బెయిల్పై ఉత్కంఠ నెలకొంది.



Updated : 11 Sept 2023 9:54 AM IST
Tags:    
Next Story
Share it
Top