ఇది పాకిస్తాన్ బోర్డర్ కాదు.. ఏపీ బోర్డర్.. టీడీపీ వీడియో వైరల్
X
చంద్రబాబు అరెస్ట్తో ఏపీలోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. బాబు అరెస్ట్కు నిరసనగా టీడీపీ శ్రేణులు సహా పలు వర్గాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు మద్ధతుగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ టు రాజమండ్రికి చేపట్టిన కార్ల ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఏపీ సరిహద్దు వద్ద వాహనాలను క్షున్నంగా తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
ఇది పాకిస్తాన్ బోర్డర్ కాదు.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అంటూ టీడీపీ ఓ వీడియో ట్వీట్ చేసింది. ఏపీ సరిహద్దు వద్ద పోలీసులు పెద్దఎత్తున మొహరించడం ఈ వీడియోలో ఉంది. ‘‘చంద్రబాబుకు మద్దతుగా, ఛలో రాజమండ్రి అంటున్న ఐటీ ఉద్యోగులకి ఏపిలోకి అడుగు పెట్టే అర్హత లేదంట. వందలాది మంది పోలీసులని దింపి, జగన్ ప్యాలెస్లో భయపడుతూ పడుకున్నాడు’’ అని టీడీపీ రాసుకొచ్చింది.
ఇది పాకిస్తాన్ బోర్డర్ కాదు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు
— Telugu Desam Party (@JaiTDP) September 24, 2023
చంద్రబాబు గారికి మద్దతుగా, ఛలో రాజమహేంద్రవరం అంటున్న ఐటీ ఉద్యోగులకి ఏపిలోకి అడుగు పెట్టే అర్హత లేదంట. వందలాది మంది పోలీసులని దింపి, ప్యాలెస్ లో భయపడుతూ పడుకున్నాడు తాడేపల్లి పిల్లి#CBNLifeUnderThreat#TDPJSPTogether… pic.twitter.com/xoNGpU8Nv1