Home > ఆంధ్రప్రదేశ్ > జేసీబీ సాయంతో వాగు దాటిన టీచర్స్...వీడియో వైరల్

జేసీబీ సాయంతో వాగు దాటిన టీచర్స్...వీడియో వైరల్

జేసీబీ సాయంతో వాగు దాటిన టీచర్స్...వీడియో వైరల్
X

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఏపీలో గత కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన గ్రామాలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇతర ప్రాంతాలకు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు నరకం చూస్తున్నారు. విద్యార్థులకే గురువులకు తిప్పలు తప్పడం లేదు.

భారీ వర్షాల కారణంగా విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెడ్డివానివలస సమీపంలో భవానమ్మ వాగు పొంగి పొర్లడంతోంది. వాగు దాటి అవతలి ఒడ్డుకు చేరేందుకు గజంగుడ్డివలస పాఠశాల ఉపాధ్యాయులు జేసీబీలను ఆశ్రయించారు. జేసీబీ ముందుభాగంలో ఉపాధ్యాయలు నిల్చొని ఉండగా డ్రైవర్ జాగ్రత్తగా వారిని వాగు దాటించాడు. టీచర్లు జేసీబీలతో వాగు దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భవానమ్మ వాగు ప్రవాహంతో ఐదు గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

మరో 3 రోజులు వర్షాలు...

మరో మూడు రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్రర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుండడంతో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈమేరకు ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated : 26 July 2023 7:26 PM IST
Tags:    
Next Story
Share it
Top