YS Jagan Mohan Reddy : సీఎం జగన్కు నోటీసులు.. ఆ కేసుపై హైకోర్టు విచారణ..
X
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి మాజీ ఎంపీ హరి రామజోగయ్య దాఖలు చేసిన పిల్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇప్పటికే 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు జగన్ కేసులపై విచారణ పూర్తి చేయాలని పిటిషనర్ కోరారు. దీనికి సంబంధించి జగన్, సీబీఐకి ఇప్పటికే కోర్టు నోటీసులు జారీ చేయగా.. అవి ఇంతవరకు ప్రతివాదులకు అందలేదు.
నవంబరు 8న విచారణ సందర్భంగా జగన్, సీబీఐకి నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఇప్పటివరకు నోటీసులు జారీ కాకపోవడంతో మరోసారి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సుమోటో పిల్‌గా ప్రజాప్రతినిధుల కేసులను న్యాయస్థానం విచారిస్తోంది. సుమోటో పిల్‌తో కలిపి జగన్ కేసుల పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని కోర్టు ఆదేశించింది. పిటిషన్లపై తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేసింది.