Home > ఆంధ్రప్రదేశ్ > YS Jagan Mohan Reddy :ఏపీ ముఖ్యమంత్రికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

YS Jagan Mohan Reddy :ఏపీ ముఖ్యమంత్రికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

YS Jagan Mohan Reddy :ఏపీ ముఖ్యమంత్రికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్‌గా పరిశీలించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలుపై విచారణ చేపట్టింది. పిల్‌లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది. మాజీ ఎంపీ తరఫున న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ధర్మాసనం ఏకీభవిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది.

ఈ మేరకు.. హరి రామ జోగయ్య పిల్‌కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులుగా జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్‌ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టును కోరారు. ఏపీ సీఎం జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిల్‌లో ప్రజాప్రయోజనం లేదని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం ఛేయగా.. ధర్మాసనం విచారణ జరిపింది.. అఫిడవిట్‌ను సవరించాలని తెలంగాణ హైకోర్టు హరిరామ జోగయ్యను ఇటీవల ఆదేశించింది.. రెండు వారాల గడువు కూడా ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లపై వివరణతో అఫిడవిట్‌ను సవరించాలని.. కేసుల స్థాయి వివరాలను స్పష్టంగా ప్రస్తావించాలని ఆదేశించింది. ఈ పిల్‌పై విచారణ జరగ్గా.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం.




Updated : 8 Nov 2023 2:02 PM IST
Tags:    
Next Story
Share it
Top