వైసీపీ కండువా కప్పుకున్న తెలుగు క్రికెటర్
X
మైదానంలో తన బ్యాటింగ్‌తో అలరించిన రాయుడు.. ఇటీవలే క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ప్రజాసేవకు సిద్ధమవుతూ.. తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాడు. కొన్ని రోజుల నుంచి వైసీపీలో చేరుతున్నారనే ఊహాగానాలకు నేడు తెరపడింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు. పార్టీ నేతలు, జగర్.. రాయుడును పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాయుడు.. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టినట్లు తెలిపారు. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు. సీఎం జగన్ పై తనకు మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలకు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన అందిస్తారని చెప్పుకొచ్చారు.
కాగా వైసీపీలో చేరిన రాయుడు.. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే, గుంటూరు నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ కావాలని రాయుడు.. జగన్ ను కోరినట్లు వార్తలు గతంలో వినిపించాయి. కాపు వర్గానికి చెందిన రాయుడు.. జనసేన పార్టీవైపు వెళ్తారని అంతా అనుకున్నారు. కాని, ఈ మధ్య కాలంలో ఆయన వైసీపీ వైపు దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు కూడా చేశాడు.