Home > ఆంధ్రప్రదేశ్ > సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ కుటుంబం మొత్తం బలి..

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ కుటుంబం మొత్తం బలి..

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ కుటుంబం మొత్తం బలి..
X

సరదాగా విదేశీ యాత్ర చేసొద్దామని వెళ్లిన ప్రవాస తెలుగు కుటుంబం రోడ్డు ప్రమాదంలో బలైంది. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. రియాద్‌ నగరానికి 120 కి.మీ. దూరంలోని హఫ్నా రోడ్డుపై ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులను అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన దండు గౌస్ బాషా, అతని భార్యా పిల్లలుగా గుర్తించారు. కువైట్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న బాషా.. తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కొడుకులు ఏహాన్, దామీల్‌లతో కలిసి పది రోజుల పర్యటన కోసం సౌదీ వెళ్లారు. మక్కా, మదీనా మసీదును చూసిన తర్వాత తిరిగి కారులో వెళ్తుండగా శుక్రవారం వేకువ జామున ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో నలుగురూ అక్కడికక్కడే చనిపోయారు. ఏహాన్ వయసు రెండేళ్లు కాగా, దామీల్ వయసు ఏడు నెలలే. డివైడర్‌ను ఢీకొట్టగానే కారు భారీ మంటల్లో చిక్కుకుంది. మృతదేహాలు గుర్తులేని విధంగా కాలిపోయాయి. సౌదీలోని ప్రవాస భారతీయ సంఘాలు ఈ విషయాన్నరి గౌస్ బాషా కుటుంబానికి తెలిపాయి.

Updated : 26 Aug 2023 7:42 PM IST
Tags:    
Next Story
Share it
Top