రాష్ట్ర వ్యాప్తంగా.. రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్
X
విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు (మంగళవారం, జులై 25) స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (TNSF) వెల్లడించింది. దానికి ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కూడా (AISF) మద్దతునిచ్చింది. దీంతో మంగళవారం ఆంధ్రప్రదేశ్ లోని స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో77ను రద్దు చేయాలని, ప్రతీ స్టూడెంట్ కు ఫీ రియంబర్స్ మెంట్ ఇవ్వాలని, మెగా డీఎస్సీ నిర్వహించాలని టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది.
అంతేకాకుండా.. ప్రైవేట్ స్కూళ్లలో భారంగా మారుతున్న ఫీజులను నియంత్రించాలని, సంక్షేమ హాస్టల్స్ ను ఆధునీకరణ చేయాలని డింమాండ్స్ వినిపిస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఉపయోగపడే.. విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 53వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయాలనేది కూడా వీరి డిమాండ్ లో భాగమే.