Home > ఆంధ్రప్రదేశ్ > AP Assembly : ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

AP Assembly : ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

AP Assembly   : ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
X

గుంటూరు జిల్లా వెలగపూడిలోని అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్‌లు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల కళ్లగప్పి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సర్పంచ్‌లు ఛలో అసెంబ్లీకి తరలివచ్చారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. గ్రామ పంచాయతీ నిధులు సచివాలయ కార్యదర్శలకు కాకుండా తమకే ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సర్పంచులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, సర్పంచులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు సర్పంచులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని వాహనాల్లో అక్కడి నుండి తరలిస్తున్నారు. అసెంబ్లీ ముందు సర్పంచుల ఆందోళన.. లోపల టీడీపీ ఎమ్మెల్యేల నిరసనతో ఒక్కసారిగా అసెంబ్లీ హీటెక్కింది. కాగా, ఎన్నికల వేళ సర్పంచులు ఏకంగా అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని వాటిని తమ ఖాతాల్లో జమ చేయాలని సర్పంచ్‌లు డిమాండ్ చేశారు.




Updated : 6 Feb 2024 11:00 AM IST
Tags:    
Next Story
Share it
Top