Home > ఆంధ్రప్రదేశ్ > Kakinada : కాకినాడలో ఉద్రిక్తత..బోటును తగలపెట్టిన మత్స్యకారులు

Kakinada : కాకినాడలో ఉద్రిక్తత..బోటును తగలపెట్టిన మత్స్యకారులు

Kakinada : కాకినాడలో ఉద్రిక్తత..బోటును తగలపెట్టిన మత్స్యకారులు
X

కాకినాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యు.కొత్తపల్లి మండలంలో మత్స్యకారుల ఆందోళన మూడో రోజు కొనసాగుతోంది. కాలుష్య ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను విడిచిపెట్టేందుకు సముద్రంలో వేసిన పైపు లైన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. కోనసాపపేటలో వందలాది మత్స్యకార కుటుంబాలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ధర్నాకు దిగిన వీరిని పోలీసులు అడ్డగించగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వ్యర్థాలను సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపద తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక తమ జీవనోపాధిని దెబ్బతీసే పైపు లైన్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయం కోసం మూడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బోటును తగలబెట్టిన నిరసన చేశారు. మరికొందరు ఆందోళనకారులు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.




Updated : 8 March 2024 8:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top