Home > ఆంధ్రప్రదేశ్ > AP Assembly : ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

AP Assembly : ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

AP Assembly : ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత
X

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనకు దిగారు. జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎదుట ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు బారికేడ్స్ పెట్టి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు టీడీపీ నేతలు.

అయితే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించారు. సభలో కూడా గవర్నర్ కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ అన్ని అబద్ధాలే చెప్పారని టీడీపీ నేతలు మండిపడ్డారు. బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ..జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ అబద్ధాలు చెప్పలేక గవర్నర్ ను ఇబ్బంది పెట్టారన విమర్శించారు. జగన్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్విర్యం అయ్యిందని ఆరోపించారు. వైసీపీ విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. అయితే రసభసగా గవర్నర్ ప్రసంగం సాగింది. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగంపై రేపు తీర్మానం చేయనున్నారు. అయితే ఈ నెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Updated : 5 Feb 2024 12:54 PM IST
Tags:    
Next Story
Share it
Top