Home > ఆంధ్రప్రదేశ్ > పులివెందులో చంద్రబాబు.. తీవ్ర ఉద్రిక్తత..

పులివెందులో చంద్రబాబు.. తీవ్ర ఉద్రిక్తత..

పులివెందులో చంద్రబాబు.. తీవ్ర ఉద్రిక్తత..
X

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత ఊరు పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. బాబు తమ ఊరికి రాకూడదని నినాదాలు చేస్తున్నాయి. పూలంగళ్లు సర్కిల్‌ వద్ద ఓ కారులో వైసీపీ కార్యకర్తలు తమ పార్టీ జెండాలు ఊపుతూ రచ్చరచ్చ చేశారు. ‘జై జగన్ జై జగన్’ అని అరిచారు. వారికి, టీడీపీ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. టీడీపీ కార్యకర్తలు వెంటపడడంతో వైసీపీ నిరసనకారులు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల సంద‌ర్శ‌న‌లో భాగంగా చంద్రబాబు బుధవారం కడప జిల్లాలో జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. గండికోట‌, చిత్రావ‌తి ప్రాజెక్టులు సందర్శించిన ఆయన పులివెందుల‌లో రోడ్ షో, బ‌హిరంగ స‌భ నిర్వ‌హించనున్నారు.

Tension prevailed in Ap cm jagan mohan reddy constituency pulivendula tdp ysr congress cadres clash


Updated : 2 Aug 2023 6:51 PM IST
Tags:    
Next Story
Share it
Top