Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu: ఏసీబీ కోర్టుకు కీలక డాక్యుమెంట్లు అందజేసిన సీఐడీ అడ్వకేట్

Chandrababu: ఏసీబీ కోర్టుకు కీలక డాక్యుమెంట్లు అందజేసిన సీఐడీ అడ్వకేట్

Chandrababu: ఏసీబీ కోర్టుకు కీలక డాక్యుమెంట్లు అందజేసిన సీఐడీ అడ్వకేట్
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 11గంటలకు విచారణ ప్రారంభమవ్వగా..ఇరుపక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని.. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారని చంద్రబాబు అడ్వకేట్ దూబే వాదించారు. చంద్రబాబు సీఎం హోదాలో నిధులు మాత్రమే మంజూరు చేశారన్నారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఈ కేసులో చంద్రబాబు పాత్రను బయటపెట్టే డాక్యుమెంట్లను సీఐడీ తరుపున వాదిస్తున్న ఏఏజీ పొన్నవోలు కోర్టుకు సమర్పించారు. పలు షెల్ కంపెనీల నుంచి టీడీపీ అకౌంట్లోకి 27కోట్లు వచ్చాయని అభియోగాలు మోపారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టుకు అందజేశారు. ఈ నెల 10న ఆడిటర్ ను సీఐడీ విచారించనుందని అన్నారు. ఈ కేసులో బాబుకు బెయిల్ ఇవ్వొద్దని.. స్కిల్ స్కామ్ కర్త, కర్మ, క్రియ అంతా ఆయనేనని పొన్నవోలు వాదించారు. బాబును సీఐడీ కస్టడీకి ఇస్తే మిగితా వివరాలు రాబట్టేందుకు వీలుంటుందని కోర్టును కోరారు. మరోవైపు ఇవాళ్టితో చంద్రబాబు రిమాండ్ ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Updated : 5 Oct 2023 2:07 PM IST
Tags:    
Next Story
Share it
Top