వైకాపా నేతలకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు
X
స్పెషల్ స్టేటస్‌ను డిమాండ్ చేస్తూ 2015లో అప్పట్లో వైకాపా నేతలు ఏపీలో బంద్‌కు పిలుపునిచ్చారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున నేతలు ఆందోళన చేపట్టారు. నిరసనల నేపథ్యంలో స్థానిక కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 55 మందికిపైగా వైకాపా నేతలపై 341, 188, 290 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల విచారణ ప్రస్తుతం విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1గా పార్థసారథి, ఏ2గా కొడాలి నాని, ఏ3గా వంగవీటి రాధాల పేర్లు ఉన్నాయి. వీరితో పాటు మరో 52 మందిపై కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. తాజాగా మంగళవారం జరిగిన విచారణకు హాజరవకపోవడంతో స్పెషల్ కోర్టు న్యాయాధికారి గాయత్రీదేవి..పార్థసారథి, కొడాలి నానితో సహా వంగవీటి రాధాకు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు.