Home > ఆంధ్రప్రదేశ్ > ఆ కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని పిటిషన్.. విచారణ వాయిదా

ఆ కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని పిటిషన్.. విచారణ వాయిదా

ఆ కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని పిటిషన్.. విచారణ వాయిదా
X

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు పేరును చేర్చాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఓ పిటిషన్ వేయగా.. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు. దర్యాప్తులో ఏసీబీ విఫలమైందని, అందుకే సీబీఐకి అప్పగించాలని అందులో కోరారు. ఈ పిటిషన్లపై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. అయితే విచారణను వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టును కోరారు. లూథ్రా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. కాగా ఈ కేసును తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే జైలుకు కూడా వెళ్లొచ్చారు.

Updated : 29 Nov 2023 3:58 PM IST
Tags:    
Next Story
Share it
Top